రైల్వే ప్రయాణికులకి గుడ్ న్యూస్…ఈ ధరల్లో తగ్గింపు..!

-

రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో వారికి రిలీఎఫ్ కలగనుంది. ఇండియన్ రైల్వేస్ ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను తగ్గించాలని ఇండియన్ రైల్వేస్ అనుకుంటోంది. కరోనా వైరస్ నేపథ్యం లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ వాటిని తగ్గించాలని అనుకుంటోంది. అందుకే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ మళ్లీ ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను మునపటి స్థాయికి తగ్గించేసింది.

ఇది ఇలా ఉంటే ఇండియన్ రైల్వేస్ ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను కరోనా కారణంగా 2020 మార్చి నెల లో పెంచేసింది. రద్దీని తగ్గించడానికి రైల్వేస్ అప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ప్లాట్‌ ఫామ్ టికెట్ ధరలు రూ50 వరకు పెరిగాయి.

కానీ ఇప్పుడు ప్లాట్‌ ఫామ్ టికెట్లు రూ.10లకే లభించనున్నాయి. దీనితో చాలా మందికి రిలీఫ్ కలగనుంది. అలానే స్పెషల్ ట్రైన్స్‌ను సాధారణ రైళ్ల మాదిరిగానే నడుపుతోంది. దీంతో ఈ ట్రైన్స్‌లో కూడా టికెట్ ధరలు కూడా తగ్గిపోయాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news