ఎన్నికలు ఎప్పడు వచ్చినా.. బీజేపీకి 80 సీట్లు ఖాయం- తరుణ్ చుగ్

తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వ్యూహాలు, ప్రణాళికలను సిద్దం చేసుకుంటుంది బీజేపీ పార్టీ. ముఖ్యంగా తెలంగాణలో అన్నిస్థానాలకు అభ్యర్థులను సిద్దం చేసుకునే పనిలో ఉంది. తాజాగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ తగిలిందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా.. కేసీఆర్ కు 60 మంది కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నుంచి పాతికమందికి పైగా నాయకులు బీజేపీతో టచ్ లో ఉన్నారని తరుణ్ చుగ్ అన్నారు.  తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా. .. బీజేపీ 80 స్థానాలకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే బీజేపీ సత్తా తెలుస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన అధ్యాయమన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు బాధపడ్డారన్నారు. చట్టాలు అమల్లోకి వస్తే చాలా బాగుండేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.