దేశీ దిగ్గజ బ్యాంకులు కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించాయి. దీనితో ఈ బ్యాంక్ కస్టమర్స్ కి ఉపయోగకరంగా ఉంటుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ HDFC Bank, ప్రభుత్వ రంగ ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా Bank of Baroda ఈ మూడు బ్యాంకులు కూడా సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ మూడు బ్యాంకులు సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకు వచ్చిన ప్రత్యేక స్కీమ్స్ గడువును పొడిగిస్తూ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. మామూలుగా అయితే గడువు జూన్ 30తోనే ముగియాల్సి ఉంది.
కానీ బ్యాంకులు మరో సారి ఈ స్కీమ్స్ గడువును ఎక్స్టెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రత్యేక పథకాలు ఇకపై సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉండనున్నాయి. వీటిల్లో చేరడం వల్ల సాధారణ వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. దీనితో కస్టమర్స్ కి బెనిఫిట్ గా ఉంటుంది.
కానీ వీటిల్లో కనీసం 5 ఏళ్లు డబ్బులు ఎఫ్‌డీ చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఎస్‌బీఐ సాధారణ కస్టమర్లకు 5 ఏళ్ల ఎఫ్‌డీలపై 5.4 శాతం వడ్డీని అందిస్తోంది.
ఒకవేళ కనుక ప్రత్యేక స్కీమ్స్ లో చేరితే 6.2 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే 6.25 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. ఇది ఇలా ఉంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 6.25 శాతం వడ్డీని ఇస్తోంది.