వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ.155కే అపరిమిత కాల్స్..!

తాజాగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. దీనితో కస్టమర్స్ కి బెనిఫిట్ గా ఉంటుంది. వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 155 రూపాయల చౌకైన ప్లాన్ ను ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 24 రోజులు కావడం గమనార్హం. ఈ ప్లాన్ రెండు సిమ్స్ ని వాడే వాళ్లకి బాగుంటుంది. వొడాఫోన్ ఐడియా కింద 155 రూపాయలు, 239 రూపాయలు, 666 రూపాయలు, 699 రూపాయల ప్లాన్లను తీసుకు వచ్చింది. ఇక 155 రూపాయలు ప్లాన్ లోకి వెళితే.. 155 రూపాయల ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 300 మెసేజ్ లను పొందొచ్చు. అలానే 1జీబీ ఇంటర్నెట్ ని కూడా పొందొచ్చు. కాల్స్ కోసం మాత్రమే రీచార్జ్ చేసుకునే వాళ్లకి ఇది బాగుంటుంది.

ఇది ఇలా ఉంటే 666 రూపాయల ప్లాన్ ను కూడా తీసుకు వచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 77 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజువారీ ఇంటర్నెట్ తో పాటు అపరిమిత కాల్స్ కూడా చేసుకోచ్చు. బింగే ఆల్ నైట్, డేటా డిలైట్ ఆఫర్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ సౌకర్యం ని కూడా పొందొచ్చు. అలానే వొడాఫోన్ ఐడియా 699 ప్రీ పెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 3జీబీ డేటా దీనితో పొందొచ్చు. హంగామా ప్రీమియం సభ్యత్వం పొందొచ్చు.