పరిటాల సెన్సేషనల్ అల్టిమేటం… బాబు చిక్కుల్లో పడతారా?

-

తెలుగుదేశం పార్టీలో పరిటాల ఫ్యామిలీకి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఆ ఫ్యామిలీకి.. పార్టీకి ఉన్న సంబంధం ఏంటో కూడా చెప్పక్కర్లేదు. టీడీపీ అంటే పరిటాల.. పరిటాల అంటే టీడీపీ ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే అనంతపురం జిల్లాలో టీడీపీని నిలబెట్టే వారిలో పరిటాల ఫ్యామిలీ ముందు ఉంటుంది. అయితే ఇలా పార్టీలో కీలకంగా ఉన్న పరిటాల ఫ్యామిలీ… పరోక్షంగా చంద్రబాబుకు ఒక అల్టిమేటం జారీ చేసింది.. అది కూడా ధర్మవరం సీటు విషయంలో.. నెక్స్ట్ గానీ తనకు ధర్మవరం సీటు ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పరిటాల శ్రీరామ్ అన్నారు.

కాకపోతే బాబుకు డైరక్ట్‌గా వార్నింగ్ ఇచ్చే స్థాయిలో చెప్పలేదు. పరోక్షంగా టీడీపీలోకి రావాలని అనుకుంటున్న ఒక మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో ధర్మవరం నియోజకవర్గం గోనుగుంట్ల సూర్యనారాయణ చేతిలో ఉండేది. ఈయన 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఈయనే పోటీ చేశారు. కానీ కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డిపై ఓడిపోయారు. ఓడిపోయాక గోనుగుంట్ల టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారు.

అంటే బీజేపీలో చేరితే సేఫ్ సైడ్‌గా ఉండొచ్చని అలా చేశారు. అయితే ఏపీలో బీజేపీ ఏ మాత్రం పుంజుకోలేని పరిస్తితి. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. పైగా ఇప్పుడుప్పుడే టీడీపీ పికప్ అవుతుంది. ఈ క్రమంలోనే గోనుగుంట్ల టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని తెలిసింది. ఆయన అనుచరులు సైతం టీడీపీలోకి వచ్చి ధర్మవరం బరిలో ఉంటారని మాట్లాడారు.

అయితే ధర్మవరం బాధ్యతలని పరిటాల శ్రీరామ్ చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు పార్టీలోకి వచ్చిన కండువా కప్పుతామని..కానీ సీటు మాత్రం తనదే అని, ఒకవేళ నెక్స్ట్ గానీ సీటు రాకపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానని అన్నారు. దీంతో చంద్రబాబు చిక్కుల్లో పడ్డట్టు అయింది. గోనుగుంట్ల పార్టీలోకి వస్తే..ధర్మవరం విషయంలో చిక్కులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news