బెంగాల్‌లో పోలింగ్‌ వాహనాలకు జీపీఎస్‌

-

లోక్సభ ఎన్నికల వేళ అవాంఛనీయ సంఘటనలను అరికట్టడంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్‌ లోకేషన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బందికి అవసరమైన సూచనలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఈవీఎం సహా ఇతర సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించే సమయంలో.. ఎన్నికలు ముగిసిన తర్వాత వాటిని స్ట్రాంగ్‌ రూమ్‌లకు తీసుకొచ్చే వరకు పర్యవేక్షించేందుకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఉపయోగించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. ఒకవేళ ఏమైనా అవకతవకలు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డ్రైవర్లు సహా పోలింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులను ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 7 దశల్లో జరగనున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version