అభిమాని కుటుంబానికి ది ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ప్రైజ్

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ది ఫ్యామిలీ స్టార్. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విజయ్ అభిమానికి సర్ ప్రైజ్ ఇచ్చారు.

హైదరాబాద్‌ సూరారంలోని దివ్యాంగురాలైన యువతి స్వరూప ఇంటిని సందర్శించారు. ఫ్యామిలీ స్టార్‌ సినిమా ప్రచారంలో భాగంగా ప్రశాంత్ అనే అభిమాని తన చెల్లి కష్టపడి ఎదిగిన తీరును దిల్ రాజుకు వివరించాడు. ఉద్వేగానికి గురైన దిల్ రాజు తప్పకుండా విజయ్తో కలిసి ఇంటికొస్తానని మాటిచ్చారు. మాట ప్రకారం సూరారంలోని నివాసానికి వచ్చిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా బృందం.. స్వరూప కుటుంబంతో కాసేపు సరదాగా గడిపి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగురాలైనా ఎంతో కష్టపడి స్వరూప కుటుంబంలో ఉన్నత స్థాయికి చేరడం ఆనందంగా ఉందని విజయ్ అభినందించారు. స్టార్ హీరో తమ ఇంటికి రావడంతో స్వరూప కుటుంబం పట్టరాన్ని ఆనందం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version