పెంచిన గ్యాస్ ధరను రాష్ట్రాలు భరించవు
కేంద్రం వడ్డన ఆపడం లేదు
దీంతో చిరు వ్యాపారులకు ఈ పరిణామం తీవ్ర నష్టం
పెరిగిన ధర ప్రకారం చెన్నయ్ లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేల 185 రూపాయలుగా ఉంది.తెలుగు రాష్ట్రాలలో కూడా పండుగ పూట చేదు వార్త తీవ్ర కలవరం రేపుతోంది.ఇప్పటికే వ్యాపారాలు లేక అవస్థ పడుతున్న తమకు తాజా పరిణామం ఓవిధంగా కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు చిరు వ్యాపార వర్గాలు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఇంకా రెండు దశల్లో ఎన్నికలు మిగిలే ఉన్నాయి.అవి మార్చి 3,7 తారీఖుల్లో జరగనున్నా యి.ఇంకా అవి పూర్తి కానేకాలేదు అప్పుడే కమర్షియల్ సిలిండర్ ధర అమాంతం పెంచి వినియోగ దారులకు ఝలక్ ఇచ్చింది. దీంతో శివరాత్రి రోజుతో కేంద్రం ఇచ్చిన ఈ ప్రకటన సామాన్యులపై ప్రభావం చూపనుంది.చిన్న,చిన్న దుకాణాలు పెట్టుకుని జీవితం నెట్టుకువస్తున్న వ్యాపారులకు పెంచిన ధర ప్రభావం పుష్కలంగా ఉండనుంది.టిఫిన్ దుకాణాలు నడుపుకునే వారికి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఓ విధంగా శరాఘాతమే!
వాస్తవానికి ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం కారణంగా ధరలు పెరుగుతాయి అని ఆందోళనలు ఎప్పటి నుంచో ఉన్నాయి.అయితే వీటిపై ఏ స్పష్టతా మాత్రం ఇప్పటికైతే లేదు.బంగారం ధరలు కూడా ఒక రోజు పెరిగి మరో రోజు తగ్గుతూ వస్తున్నాయి.పెట్రో ధరలు కూడా పెద్దగా మార్పు లేకుండానే ఉన్నాయి.కానీ గ్యాస్ ధరలు మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయాయి.వాణిజ్య అవసరాలు నిమి త్తం వాడే గ్యాస్ సిలిండర్ల ధర ఒక్కసారిగా 105 రూపాయలు పెంచుతున్నామని కేంద్రం పండగ పూట బాంబు పేల్చింది. అదేవిధం గా ఐదు కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 27 రూపాయలకు పెంచామని కూడా కేంద్రం అంటోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరలేవీ పెరగవని ఓవైపు వార్తలు వచ్చినా, మరోవైపు యుద్ధం సాకుతో గ్యాస్ ధరలు పెరు గుతాయి అన్న వార్తలు వెలుగు చూసినా ఈ విధంగా ఏ లెక్కనచూసినా స్పష్టతతో కూడిన వార్తలేవీ ఇంతవరకూ వెలుగు చూడ లేదు.ఇవన్నీ ఊహాగానాలే అని నిన్నటి వరకూ తేలిపోగా కేంద్రం ఈ ఉదయం కమర్షియల్ సిలిండర్ ధర పెంచి అందరిలోనూ ఆందోళనలు రేపింది.దీని ప్రకారం కోల్ కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేల రూపాయలు దాటిపోనుంది. ఇదేవిధంగా ముఖ్య నగరాలన్నింటిలోనూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా చుక్కలు చూపించడం ఖాయం.దీంతో రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు తమ వ్యాపారాలు సాగించేదెలా అని వాపోతున్నారు.