హైకోర్టులో డేరా బాబాకు ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా తీర్పు

-

డేరా సచ్చా సౌదా చీఫ్‌, వివాదాస్పద మతగురువు గుర్మింత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ఊరట లభించింది. ఓ హత్య కేసులో అతడిని జస్టిస్‌ సురేష్‌వార్‌ ఠాకూర్‌, జస్టిస్‌ లలిత్‌ బత్రాతో కూడిన డివిజన్‌ బెంచ్‌ నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పటికే పంచ్‌కులలోని సీబీఐ కోర్టు ఒక రేప్‌, జర్నలిస్టు రామ్‌ చందర్‌ ఛత్రపతి, డేరా నిర్వాహకుడు రంజిత్‌ సింగ్‌ హత్య కేసుల్లో బాబాను నిందితుడిగా పేర్కొంటూ తీర్పును ఇచ్చింది. దీనిని డేరాబాబా హైకోర్టులో సవాలు చేయగా.. వీటిల్లో రంజిత్‌ సింగ్‌ హత్యకేసులో నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వచ్చింది.

ఇక అత్యాచారం, జర్నలిస్టు ఛత్రపతి హత్య కేసుల్లో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం రావాల్సి ఉంది. ప్రస్తుతం అతడు రోహ్‌తక్‌లోని సునారియా జైల్లో ఉన్నాడు. ఈ కేసులో ఆయనతోపాటు మరో నలుగురు సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

డేరా బాబా ఆశ్రమంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులను పేర్కొంటూ రాసిన ఓ లేఖ అప్పట్లో కలకలం రేపింది. అది ఆశ్రమ మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ రాసినట్లు అనుమానించిన డేరా బాబా ఆయన్ను హత్య చేసేందుకు కుట్రపన్నినట్లు సీబీఐ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news