రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం.. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు : హరీశ్ రావు

-

వానాకాలం పంట సాగుకు రైతులు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే పలుచోట్ల విత్తనాల కోసం కర్షకులు అరిగోస పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరత రైతుల పాలిట శాపంగా మారింది. డిమాండ్‌ మేరకు విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు దిగగా.. పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో కాస్త తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణమని అన్నారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..? అని నిలదీశారు. ‘ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుంది. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయి. ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలి. అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news