IND VS PAK : భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఇవాళ కూడా భారీ వర్షం !

-

IND VS PAK :  ఆసియాకప్ లో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురవుతుంది. ఈనెల 2న మ్యాచ్ వర్షంతో రద్దు అవగా, నిన్న మ్యాచ్ కు కూడా వరుణుడు అడ్డుగా నిలిచాడు. ఇవాళ రిజర్వ్ డే ఉండగా, వర్షం ముప్పు ఉందని అంచనా. ఇవాళ కోలంబోలో 85% వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

What happens if Asia Cup Super 4 match is washed out on reserve day
What happens if Asia Cup Super 4 match is washed out on reserve day

నిన్న ఆగిపోయిన 24.1 ఓవర్ల నుంచి ఇన్నింగ్స్ ను మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. క్రిజులో విరాట్ (8*), రాహుల్ (17*) ఉన్నారు. స్కోరు 147/2. కాగా, వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది భారత జట్టు.  అంతకుముందు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, శుభారంభం అందించారు. అయితే హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఇద్దరూ వెంటవెంటనే అవుట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news