సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. లండన్ నుండి నేడు ఏపీకి రానున్నారు సీఎం జగన్. తన కూతుర్లను కలిసేందుకు లండన్ వెళ్లిన సీఎం జగన్.. పర్యటన ముగించుకుని ఈరోజు రాత్రికి ఏపీకి చేరుకుంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు, అధికారులు.
![CM Jagan will come to AP from London today](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/09/CM-Jagan-will-come-to-AP-from-London-today.jpg)
కాగా, సీఎం జగన్, ఆయన సతీమణి భారతి వ్యక్తిగత పర్యటన నిమిత్తం సెప్టెంబర్ 2 వ తేదీన రాత్రి 9:30 గంటలకు లండన్ బయలుదేరి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న తమ పిల్లల్ని కలిసేందుకు దంపతులిద్దరూ వెళ్లారు.
ఇది ఇలా ఉండగా, ఏపీలో టీడీపీ బంద్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నేతలు బంద్ కు పిలుపునిచ్చినా .. దాని ప్రభావం నెల్లూరు జిల్లాలో కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టిడిపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు …ప్రైవేట్ బస్సులు యధావిధిగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.