ముంబయి నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు

-

ముంబయి నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఈరోజు తెల్లవారుజామున మొదలైన వాన ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో భారీగా వరద పోటెత్తి వర్షపు నీరు పలు ప్రాంతాలను ముంచెత్తింది. రోడ్లపై నీళ్లు నిలిచి వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలుప్రాంతాల్లో కార్లు, బైకులు నీళ్లలో మునిగిపోయాయి. గత రాత్రి నుంచి ఏడు గంటల్లో  30 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంధేరి, కుర్లా, భందూప్‌, కింగ్స్‌ సర్కిల్‌, దాదర్‌తోపాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

భారీ వర్షానికి డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడం వల్ల సబర్బన్‌ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. పలు రైళ్లను సెంట్రల్‌ రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. భారీ వర్షాల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు నిలిపివేశారు. సబ్‌ వేలలోకి కూడా భారీగా వర్షపు నీరు చేరగా అవి పూర్తిగా జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ముంబయిలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సెలవు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news