మధురై దంపతులకు నోటీసులు పంపిన హీరో ధనుష్..పరువు నష్టం దావా వేస్తానంటూ..

ధనుష్ తమ రక్తం పంచుకుని పుట్టిన కుమారుడు అంటూ మధురైకి చెందిన కేతిరేశన్, మీనాక్షి దంపతులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమకు జీవనాధారం కోసం నెలకు రూ. 60 వేలు ఇవ్వాలని ఆ దంపతులు ధనుష్ కి నోటీసులు పంపారు. అయితే వారి మాటలు అబద్ధాలు అని.. ధనుష్ పై కేవలం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నారు ఆయన తండ్రి కస్తూరి రాజా. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న మదురై దంపతులకు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు పంపారు.

అబద్దాలు చెప్పడం మానుకోకపోతే వారిపై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీసులో పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు చేసినందుకు తనకు క్షమాపణ చెప్పాలన్నారు. అయితే ఇటీవల మధురై వేల్పూరి కి చెందిన కేతిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తన కుమారుడు అయిన ని సినిమాల్లో నటించేందుకు ఇంట్లో నుంచి పారిపోయాడని గతంలోనే కోర్టుకు తన జనన ధ్రువీకరణ పత్రాలను నకిలీ అందజేశారు అని ఆరోపించారు కేతిరేశన్ దంపతులు. దీంతో మద్రాసు హైకోర్టు హీరో ధనుష్ కు సమన్లు జారీ చేసింది. దీంతో మధురై దంపతులకు లీగల్ నోటీసులు పంపి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు హీరో ధనుష్.