పొలిటికల్‌ ఎంట్రీపై మరోసారి హీరో విశాల్‌ కామెంట్స్

-

సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంతో మంది సినీ నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కొందరు పార్టీలు కూడా ఏర్పాటు చేసి పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. తరాలు మారినా రాజకీయాల్లోకి సినీ నటుల ఎంట్రీ మమాత్రం ఆనవాయితీగా వస్తోంది. ఈ తరం నటుల్లోనూ చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు.

ఇక తమిళ నటుల్లోనూ ఇప్పటికే చాలా మంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే దళపతి విజయ్ కూడా తన పార్టీ పేరును ప్రకటించారు. ఇక హీరో విశాల్ కూడా పాలిటిక్స్ లోకి వస్తారనే చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లోనే పోటీ చేస్తారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో అయితే పోటీ చేసే ఉద్దేశం లేదని విశాల్ క్లారిటీ ఇచ్చాడు.

ఇక తాజాగా మరోసారి తన పొలిటికల్‌ ఎంట్రీపై నటుడు విశాల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ త్వరలోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నానని, పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతుల్లేవని, వారికి సేవ చేసి.. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news