IPL 2024 : ముగిసిన లక్నో ఇన్నింగ్స్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య 28 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్లలో డికాక్ దారుణంగా విఫలమయ్యారు.

8 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపినర్ రాహుల్ 27 బంతుల్లో 39 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీపక్ హూడ 8 పరుగులు చేయగా, మార్కస్ స్టోయినిస్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ఇక ఆయుష్ బదోని 29 రన్స్ , నీకొలస్ పూరాణ్ 35 బంతుల్లో 45 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ ని అందించారు.కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో స్టార్క్ 3, వైభవ్, సునీల్ నరైన్, వరుణ్, రస్సెల్ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news