కేరళ సీఎం పినరయి విజయన్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు

-

సీఎంఆర్ ఎక్సాలాజిక్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల పై విజిలెన్స్ దర్యాప్తునకు విజిలెన్స్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్సాదన్ దాఖలు చేసిన అప్పీల్ పై కేరళ హైకోర్టు  మంగళవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణకు నోటీసులు జారీ చేసింది. సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు., న్యాయవాది గిల్బర్ట్ జార్జ్ కొర్రెయా R1 (పినరయి విజయన్), R7 (వీణా తైకండియిల్) కోసం నోటీసులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి CMRL మరియు ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నోటీసు కూడా జారీ చేశారు.

కుజల్సాదన్ ఆరోపణలకు మద్దతు ఇవ్వడానికి ప్రాథమిక సాక్ష్యాలు లేవని అలాగే అందువల్ల పిటిషన్ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని., సమర్పించిన పత్రాలు ఆరోపణలను రుజువు చేయలేవని పేర్కొంటూ ఎమ్మెల్యే పిటిషన్ను విజిలెన్స్ కోర్టు తిరస్కరించింది. తాను సమర్పించిన సాక్ష్యాలను కూలంకషంగా పరిశీలించకుండానే విజిలెన్స్ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని కుజల్సాదన్ తన రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఆదాయపు పన్ను శాఖ మధ్యంతర సెటిల్మెంట్ బోర్డు వెల్లడించిన వివరాల ఆధారంగా.. ఈ పిటిషన్ దాఖలైంది. వీణా యాజమాన్యంలోని ఎక్సాలాజిక్ సొల్యూషన్కు CMRL చెలింహాలు చేసిందని బోరు గురించింది.

Read more RELATED
Recommended to you

Latest news