దివాలా దిశగా హిమాచల్ ప్రదేశ్.. ఉచిత పథకాల్లో భారీగా కోత!

-

ఉచితాల ప్రభావం రాష్ట్రాలను అప్పుల్లోకి నెడుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పొలిటికల్ పార్టీలు ఉచితాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలం అవుతున్నాయి.అందుకు కారణం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటం. ఇచ్చిన హమీలన్నీ పూర్తి చేయాలంటే తిరిగి అప్పులు చేయాల్సిందే. ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి.

తాజాగా హిమాచల్ ప్రదేశ్‌ దివాలా అంచులకు చేరింది. గత ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత పథకాలే అందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ రూ.58వేల కోట్లుగా ఉండగా.. అప్పులు 95వేల కోట్లకు చేరాయి. జీతాలు, పింఛన్లకే రూ.42వేల కోట్లు పోతోంది.ఇక వడ్డీలు, అప్పులు తీర్చేందుకు, అభివృద్ధికి డబ్బులే మిగలడం లేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచితాల్లో 50 శాతం కోత విధించాలని భావిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉచిత కరెంటు, మహిళలకు రూ.1500, బస్సుల్లో 50శాతం డిస్కౌంట్ ఇస్తుండగా.. ఇప్పుడు వాటిలో కోత పెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news