ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం

-

2021 లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను కొన్ని ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చి కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చింది. ఈ కొత్త లిక్కర్ పాలసీ స్కాం వైపు దారితీసింది అనే ఆరోపణల నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు కూడా అరెస్టు అయ్యారు.

ఇటీవల ఈ కేసు పై జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ విజయ్ నాయర్ కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయ్ నాయిర్ తరపున వాదనలు వినిపించారు తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి.

జస్టిస్ ఎస్వీఎన్ బట్టి, జస్టిస్ హ్రిషికేష్ లతో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో సుదీర్ఘంగా అండర్ ట్రయల్ ఖైదుగా ఉండడంతో విజయ్ నాయర్ బెయిల్ కి అర్హుడని అభిప్రాయ పడింది సుప్రీంకోర్టు. కాగా సౌత్ గ్రూప్ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 100 కోట్లు విజయ్ కి అందజేసినట్లు గతంలో దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి.

Read more RELATED
Recommended to you

Latest news