హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌.. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీని వెనుకంజ

-

ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ కాస్త వెనకబడ్డారు. అదానీని దాటేసి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. దీంతో ముకేశ్ భారత సంపన్న వ్యక్తిగా అవతరించారు.

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాలో 0.19 శాతం సంపద వృద్ధితో అంబానీ 84.5 బిలియన్‌ డాలర్లతో 9వ స్థానంలో ఉండగా, 84.1 బిలియన్‌ డాలర్లతో అదానీ 10వ స్థానంలో కొనసాగుతున్నారు.

ఈ జాబితాలో కొద్దిరోజుల క్రితం వరకు అదానీ గ్రూప్‌ ఛైర్మన్ గౌతమ్‌ అదానీ మూడో స్థానంలో కొనసాగిన సంగతి తెలిసిందే. తాజాగా హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో అదానీ సంపద 34 బిలియన్‌ డాలర్లుకు పైగా కోల్పోయి 11వ స్థానానికి పరిమితమయ్యారు. గడిచిన 24 గంటల్లో అదానీ సంపద కొంత మేరకు పెరగగా, ఆయన ప్రస్తుతం 10వ స్థానంలో కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version