మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముస్లిం దుకాణదారులకు హిందు నాయకులు వార్నింగ్ ఇచ్చారు. హిందూ దేవతలు లేదా దేవతల పేరిట ఉన్న పటాకులను విక్రయించవద్దు అని హెచ్చరించారు. అటువంటి ఉత్పత్తులను అమ్మడం కొనసాగిస్తే మాత్రం భయంకరమైన పరిణామాల ఉంటాయి అని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు వీడియో ఒకటి వైరల్ అయింది.
ఒక వీడియోలో ఇద్దరు వ్యక్తులు… “ఈ రోజు మీరు లక్ష్మీ బాంబు లేకపోతే గణపతి బాంబును విక్రయిస్తే, మీకు నచ్చని పనులను చేయమని మేము బలవంతం చేయాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. షాపు యజమాని, బెదిరింపులు భయపడి, అతను చెప్పినట్లు చేస్తానని చెప్పడం వీడియోలో ఉంటుంది. కోపం వద్దని మేము చెప్పింది చేస్తామని చెప్పడం గమనార్హం. త్వరలో దీపావళి పండుగ ఉన్న సంగతి తెలిసిందే.