హోలీ 2021: ఈ ప్రాంతాల్లో హోలీని ఎలా చేసుకుంటారో తెలుసా..?

Join Our Community
follow manalokam on social media

హోలీ అంటేనే చాల సందడిగా జరుపుకునే పండుగ. సరదాగా ఇంటిల్లిపాది కలిసి హోలీ చేసుకుంటారు. బందు మిత్రుల తో ఎంతో సరదాగా గడుపుతారు. ఈసారి హోలీ మార్చి 29వ తేదీన వచ్చింది. చెడు పై మంచి గెలుపునకు నిదర్శనంగా ఈ హోళీ పండుగ చేసుకుంటాం. భారతదేశం అంతటా ఈ హోలీని వివిధ రకాలుగా జరుపుకుంటారు. వాటి కోసం ఇప్పుడే చూసేయండి.

ఫగువా వేడుకలు:

హోలీని అస్సామీ ప్రజలు ఫకువా / ఫగువా పేరు తో జరుపుకుంటారు. అయితే ఇక్కడ ప్రజలు ఏమి చేస్తారంటే…? రాక్షసి హోలిక సంహారానికి ప్రతీకగా ఆ ప్రజలు మట్టి గుడిసెలను తగులబెడతారు. అది అయ్యాక తరువాత హోలీ ఆడుకుంటారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. ఇదే ఫాగువ అంటే.

ధూలేటి:

ఇది అహ్మదాబాద్‌లోని జరుపుకునే పధ్ధతి. ఇది కూడా కాస్త విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ యువకులు ఒకరి భుజాల పై ఎక్కి నేల మీద ఎత్తులో వేలాడుతున్న మజ్జిగ కుండను పగలగొడతారు. ఇది వారి సంప్రదాయం.

ఉక్కులి:

ఉక్కులి అనే పేరు తో గోవా ప్రజలు హోలీని జరుపుకుంటారు. వసంత పండుగ షిగ్మోలో భాగంగా ఈ హోలీని జరుపుకుంటారు. ఏకంగా ఇక్కడ నెల రోజుల పాటు హోలీ చేసుకుంటారు.

అలానే లాథ్మార్ హోలీని యూపీ లో చేసుకుంటారు. బేదర వేషా అనే పేరు తో కర్ణాటక రాష్ట్రం లో హోలీ చేసుకుంటారు. అదే విధంగా వసంత పండుగైన బసంత ఉత్సవంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు డోల్ జాత్రా జరుపుకుంటారు. మణిపూర్ స్థానికులు తమ దేవుడైన పఖంగ్బాను గుర్తు చేస్తూ ప్రార్థనలు నిర్వహిస్తారు. దీనిని యోసాంగ్ అంటారు.

 

 

 

 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...