లెజెండరీ ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకున్నాడు. తనకు కోవిడ్ -19 కు పాజిటివ్ వచ్చిందని పేర్కొన్న ఆయన ‘తేలికపాటి లక్షణాలు’ కలిగి ఉన్నానని వైద్యుల సలహా మేరకు ఇంట్లో తనను తాను క్వారంటైన్ చేసుకుంటున్నానని పేర్కొన్నాడు.
” నన్నునేను పరీక్షించుకుంటున్నాను, కోవిడ్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నాకు కరోనా వచ్చిన కారణంగా ఇంట్లో వారికి కూడా పరీక్షలు చేశారు, అదృష్టవశాత్తూ వారికి కరోనా సోకలేదని పేర్కొన్నారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయిచుకున్నానని ఆయన పేర్కొన్నారు.
— Sachin Tendulkar (@sachin_rt) March 27, 2021