రైల్వే ట్రాకులపైనే తన జీవితం మొదలైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఇంతముందుకు మన రైల్వేలు ఎంత అధ్వాన్నంగా ఉండేవో తనకు తెలుసని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయ రైల్వే అభివృద్ధిపై ప్రత్యే శ్రద్ధ పెట్టామని వెల్లడించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 10 వందేభారత్‌లను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
“గత 10 ఏళ్లలో రైల్వేల అభివృద్ధికి గతంలో చేసిన దానికంటే ఆరు రెట్లు ఎక్కువ మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. సామాన్యులు లగ్జరీగా ప్రయాణించేలా భారతీయ రైల్వేను తీర్చిదిద్దేందుకు కృషి చేశాం. 2024లో కేవలం రెండు నెలల్లోనే రూ.11లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించాం. భారత్‌ను యువకుల దేశం. అత్యంత ఎక్కువ యువశక్తి భారత్‌లో ఉంది. మేము వేసే పునాదులు యువత దివ్యమైన భవిష్యత్‌కు గ్యారంటీ. మా పది సంవత్సరాల పని కేవలం ట్రైలర్ మాత్రమే. మరింత ముందుకు వెళ్లాల్సి ఉంది.” అని ప్రధాని మోదీ తెలిపారు.