పాన్ ఇండియా స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్

-

‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్నతో ఇక కుర్రాళ్ల గుండెల్లో పర్మినెంట్గా తిష్ట వేసింది. ఈ సినిమాలతో టాలీవుడ్లో మృణాల్కు అవకాశాలు వరుస కట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది. ఆచితూచి కథలను ఎంచుకుంటున్న మృణాల్ తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. తెలుగులోనే కాదు కోలీవుడ్లోనూ ఈ భామకు అవకాశాలు వస్తున్నాయి.

ఇక తాజాగా మృణాల్ ఓ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు టాక్. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్తో నటించే ఛాన్స్ కొట్టేసిందట ఈ భామ. హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మృణాల్ను హీరోయిన్గా తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హనురాఘవపూడి-ప్రభాస్ కాంబినేషల్లో వస్తున్న ఈ సినిమా పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ను ఫైనలైజ్ చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news