విపక్ష కూటమి పేరు భారత్ అని మారిస్తే దేశం పేరు మళ్లీ మార్చేస్తారా ? కేజ్రీవాల్

-

 ఇండియా పేరును ఇంగ్లీష్‌ భాషలోనూ భారత్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని.. రాబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి బిల్లును తీసుకురానున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా జీ-20 దేశాధినేతలకు ఇచ్చే విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రచురించడంపై తాజాగా సరికొత్త వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే విపక్ష కూటమికి భయపడే మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 

తాజాగా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. దేశం పేరును ఇండియా నుంచి భారత్ అని మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా స్పందించారు. విపక్షాలన్నీ కలిసి ఏర్పడిన కూటమికి ఇండియా అని పేరును పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ భయపడ్డారని అన్నారు. ఈ క్రమంలోనే దేశం పేరును ఇండియా కాకుండా భారత్ అని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఒక వేళ.. విపక్ష కూటమి పేరును ఇండియా నుంచి భారత్ అని మార్చితే అప్పుడు బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version