మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏదైనా సమస్య పరిష్కారానికి మాత్రం తమ పార్టీ ఎంఎన్ఎస్ ను ఆశ్రయించేందుకు మొగ్గు చూపిన ప్రజలు.. ఓటింగ్ సమయంలో మాత్రం విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. “ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలనుకున్నప్పుడు ప్రజలు మా పార్టీ గురించి ఆలోచిస్తారు. కాన ఎన్నికల రోజు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా ముందుకు సాగాలి” అని పోస్ట్ చేశారు రాజ్ ఠాక్రే. త్వరలోనే భవిష్యత్ కార్యచరణ పై దిశానిర్దేశం చేయనున్నట్టు పార్టీ శ్రేణులకు సూచించారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 230 సీట్లను గెలుచుకొని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 125 స్థానాల్లో MNS పోటీ చేసింది. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ముంబయిలోని మాహిం స్థానం నుంచి రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే బరిలోకి దిగి ఓడిపోవడం గమనార్హం.