సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మరి కొంత కాలం జీవించి ఉంటే గోవా ముందు గానే భారత దేశంలో కలిసేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన లేనందునే చాలా ఏళ్ల తర్వాత గోవా కు స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. ఈ రోజు ప్రధాన మంత్రి మోడీ గోవా పర్యటన కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు పనాజీ లో గోవా విముక్తి దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడారు.
విదేశియుల పాలన లో వందల ఏళ్లు ఉన్నా.. గోవా లో దేశ భక్తి ఏ మాత్రం తగ్గలేదని అన్నారు. అలాగే దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న యోధులను ప్రధాని మోడీ గుర్తు చేశారు. వారి త్యాగాలను కొనియాడారు. అలాగే గోవా విముక్తి కోసం చేసిన ఆపరేషన్ లో పాల్గొన్న వారినీ కొనియాడారు. కాగ భారత్ కు 1947 లో స్వాతంత్య్రం వస్తే.. పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న గోవాకు 1987 లో స్వాతంత్య్రం వచ్చింది. కాగ ఈ రోజు