యూపీ + యోగి = ఉప‌యోగి కాదు.. నిరుప‌యోగి : అఖిలేశ్ యాద‌వ్

-

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌లు స‌మీపించ‌డంతో రాజ‌కీయలు వేడెక్కుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు. తాజా గా స‌మాజ్ వాదీ పార్టీ ( ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాద‌వ్ యూపీ సీఎం పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పీఎం మోడీ అన్న‌ట్టు యూపీ + యోగి = ఉప‌యోగి కాదు.. నిరుప‌యోగి అని ఎద్దెవ చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ప్ర‌తిప‌క్ష పార్టీ నాయకుల ఫోన్ల ను సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ర‌హస్యం గా ట్యాప్ చేస్తున్నార‌ని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. త‌మ ఫోన్ల ను ట్యాప్ చేసి ర‌హ‌స్యం గా ప్ర‌తి రోజు వింటున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో రాజ‌కీయ వేడి రాజుకుటుంది. ఒక‌రి పై ఒక‌రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు. తాజా గా ఫోన్ల ట్యాప్ చేస్తున్నార‌ని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌లనం రేకిత్తిచాయి. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం పై అఖిలేశ్ యాద‌వ్ ప‌లు ఆరోప‌ణ‌లు కూడా చేశాడు. ఎన్నిక‌ల్లో ఎల‌గైనా గెల‌వాల‌ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలతో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లపై కి దాడులు చేయిస్తుంద‌ని అన్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఓడిపోత‌మ‌నే భ‌యంతో నే ఇత‌ర పార్టీల‌ను బీజేపీ వేధిస్తుంద‌ని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version