తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ

-

తూర్పు భారత రాష్ట్రాలను వేడిగాలులు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతాలకు ఈ గాలులు వస్తున్నాయని తెలిపింది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌ పెరిగినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 43.5 డిగ్రీల సెల్సియస్‌, కర్నూలులో 43.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదుకాగా, తమిళనాడులోని సేలంలో 42.3 డిగ్రీల సెల్సియస్‌, ఈరోడ్‌లో 42 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు చెప్పింది.

రాబోయే నాలుగైదు రోజుల్లోవాయవ్య, తూర్పు భారత దేశంలో 2 – 4 డిగ్రీల సెల్సియస్‌ మేర, మహారాష్ట్రలో 3 – 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, బిహార్‌, సిక్కిం, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మరో అయిదు రోజులు వేడిగాలుల నుంచి తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. తీరప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, అస్సాం, మేఘాలయ, త్రిపుర, బిహార్‌ రాష్ట్రాల్లో గాలిలో తేమ అధికంగా ఉండి ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశముందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news