పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి మార్పు ఖాయమేనా.. అతనికే ఛాన్స్ ?

-

BRS నుంచి కాంగ్రెస్‌ లో చేరిన బొంతు రామ్మోహన్, వెంకటేష్ నేతలకు అన్యాయమే జరిగింది. ఇటీవలే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి. మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి,పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ దానం నాగేందర్, చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్కర్నూల్ నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారు.

venkatesh netha ino bjp party

అయితే..ఈ లిస్ట్‌ లో BRS నుంచి కాంగ్రెస్‌ లో చేరిన బొంతు రామ్మోహన్, వెంకటేష్ నేతల పేర్లే లేవు. సికింద్రాబాద్ సీటు ఆశించిన బొంతు రామ్మోహన్, పెద్దపల్లి సీటు ఆశించిన సిట్టింగ్ ఎంపీ బోరకుంట వెంకటేష్ నేత ఇద్దరికీ ఎంపీ టికెట్ ఇవ్వకుండా మొండి హస్తం చూపించింది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో బొంతు రామ్మోహన్, వెంకటేష్ నేత ఉన్నారు. అయితే, శ్యామ్ ముఖర్జీ భవన్ నుంచి బోరకుంట వెంకటేష్ నేత కు పిలుపు వచ్చిందట. కారు దిగి చెయ్యి పట్టి కమలం గూటికి నేతకాని నేత… కాంగ్రెస్ లో భంగపడ్డ నేతకు బీజేపీ నుంచి పిలుపు వచ్చిందట. దింతో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి మార్పు ఖాయమని… బోరకుంట వెంకటేష్ నేతకు టికెట్ ఇస్తారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news