స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలంటే ఎన్నో విషయాలను తెలుసుకుని, ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. అయితే ఎన్నో కారణాల వలన స్టాక్ మార్కెట్ లో ఎన్నో మార్పులు జరుగుతాయి. ప్రస్తుతం భారత దేశంలో పాకిస్తాన్ కు సంబంధించి ఉద్రిక్తలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాక భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. పైగా రెండు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పాటుగా భారత ప్రభుత్వం కొన్ని డిఫెన్స్ రాడార్లను ప్రకటించడంతో రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్వేగానికి గురైంది.
దీని ప్రభావంతో, సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే సెన్సెక్స్ 412 పాయింట్లు లేదా 0.51% నష్టంతో 80,334.81 వద్ద ముగిసింది. నిఫ్టీ 50,141 పాయింట్లు లేదా 0.58% నష్టంతో 24,273.80 వద్దకు చేరింది. బీఎస్సీ, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు కూడా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొన్నాయి. దీని వలన మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు ఉండటంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు మరియు పెట్టుబడుల నుండి వచ్చే రాబడి తగ్గిపోతుందని భావిస్తున్నారు. ఈ ఉద్రిక్తత మధ్య కొన్ని స్టాక్స్ లాభాల్లో ముగిసాయి, కాకపోతే మరికొన్ని నష్టాలను నమోదు చేశాయి.
యాక్సిస్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ కంపెనీ మరియు టాటా మోటార్స్ లాభాల్లో ముగిశాయి. శ్రీరాం ఫైనాన్స్, ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అధాని ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు గణనీయంగా నష్టపోయాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు వస్తాయని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటి రంగం మాత్రమే కాకుండా, అన్ని రంగాల్లో నష్టాలు కనిపిస్తున్నాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ విపి ప్రశాంత్ తాప్సే తెలియజేశారు.