సామాన్యులకు బిగ్ షాక్..గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 209 పెరిగింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1731.50కి చేరింది.
పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. గృహ అవసరాల కోసం వాడే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గి, రూ. 58, 530 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి, రూ. 53, 650 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు మాత్రం పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 పెరిగిపోయి రూ. 77, 500 గా నమోదు అయింది.