ఆదివారం నాడు మాంసం తినవచ్చా…? తింటే ఏం అవుతుంది..?

-

మాంసాహారాన్ని చాలా మంది తింటూ ఉంటారు. అయితే మాంసాహారాన్ని తినడానికి కూడా కొన్ని రోజులు ఉంటాయి. ఆదివారం కొన్ని పనులు చేయకూడదని ధర్మశాస్త్రం అంటోంది. ఆ పనులు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం… ఆదివారం నాడు మాంసాహారాన్ని అసలు తినకూడదు. కానీ చాలామంది ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాన్ని తినేస్తూ ఉంటారు మాంసాహారం వండడం కి కూడా కొన్ని నియమాలు వున్నాయి. చాలామంది ఆదివారం నాడు మాంసాహారం తీసుకుంటూ ఉంటారు అయితే ఆదివారం నాడు మాంసాహారాన్ని వండడం కానీ తినడం కానీ చేయకూడదు.

ఎందుకంటే ఆ రోజు అశాంతి కలుగుతుంది ఎప్పుడు గొడవలు కలహాలు వస్తాయని ధర్మశాస్త్రం అంటోంది. ఆదివారం రోజున తలకి నూనె కూడా పెట్టకూడదు. ఆయుషుకి ఆరోగ్యానికి హానికరం అలానే పిల్లల గురించి ప్రయత్నం చేసే వాళ్ళు ఆదివారం నాడు ప్రయత్నం చేయకూడదు. ఆదివారం నాడు మద్యపానం కూడా తీసుకోకూడదు. కానీ ఎక్కువ మంది ఆదివారం రోజు తాగుతూ ఉంటారు. ఆదివారం నాడు ఈ రంగు బట్టలు కూడా ధరించకూడదు. ముదురు రంగు బట్టల్ని కానీ నలుపు బ్రౌన్ కలర్ బట్టల్ని కానీ ఆదివారం నాడు వేసుకోకూడదు.

ఆదివారం నాడు ఈ రంగు బట్టల్ని వేసుకుంటే దరిద్రం వస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి. అలానే ఆదివారం నాడు తులసి మొక్కకి అసలు నీళ్లు పోయకూడదు. ఆదివారం నాడు జుట్టు కత్తిరించుకోవడం కూడా తప్పు. బుధవారం శనివారం రోజున మాత్రమే హెయిర్ కట్ చేయించుకోవాలి కాబట్టి ఆదివారం నాడు ఈ తప్పులని చేయకండి ఈ తప్పులను చేశారంటే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news