IND vs AUS ODI Series : చివరి వన్డేలో టీమిండియా ఓటమి

-

IND vs AUS ODI Series : ప్రపంచ కప్‌ నకు ముందు టీమిండియా కు ఊహించని షాక్‌ తగిలింది. ఆసీస్‌ పై రెండు వన్డేలు గెలిచిన టీమిండియా.. చివరి మ్యాచ్‌ లో మాత్రం ఓడిపోయింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ స్పిన్ మ్యాజిక్ కు టీమిండియా తలవంచింది. 353 పరుగుల భారీ లక్ష్యచేదనలో టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుపులకు ఆల్ అవుట్ అయింది. అన్ని రంగాల్లో రాణించిన ఆసీస్ 66 పరుగులు తేడాతో గెలిచి ఊరట పొందింది.

IND vs AUS ODI Series
IND vs AUS ODI Series

మ్యాక్స్ వెల్ 10 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. ఓ దశలో భారత్ గెలుపు బాటలో పయనిస్తున్నట్టు అనిపించిన, మ్యాక్స్వెల్ తన ఆఫ్ స్పిన్ తో టీమిండియా టపార్డర్ జోరుకు కళ్లెం వేశాడు. వాషింగ్టన్ సుందర్(18), రోహిత్ శర్మ(81), విరాట్ కోహ్లీ(56), శ్రేయస్ అయ్యర్(48)ల వికెట్లు మ్యాక్స్వెల్ ఖాతాలోకి చేరాయి. ఇక భారత జట్టు వరల్డ్ కప్ కోసం సన్నద్ధం కానుంది. వరల్డ్ కప్ లో భారత్ తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతోనే ఆడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నైలో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news