కోహ్లీ విలన్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం

-

Naveen-ul-Haq : విరాట్‌ కోహ్లీ విలన్‌ అయిన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హాక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరల్డ్ కప్ 20 23 తర్వాత వన్డేల నుంచి తప్పుకోన్నట్టు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. టీ20లో మాత్రం కొనసాగుతానని చెప్పారు. 24 ఏళ్ల ఈ ప్లేయర్ అనూహ్యంగా వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

Naveen-ul-Haq announces shock retirement
Naveen-ul-Haq announces shock retirement

7 వన్డేలు మాత్రమే ఆడిన నవీన్ 14 వికెట్లు తీశారు. గత ఐపీఎల్ సీజన్ లో కోహ్లీతో వివాదంతో చర్చనియాంశంగా మారారు. లక్నో ప్లేయర్ అయిన నవీన్ ఉల్ హాక్…. మొన్నటి ఐపీఎల్‌ 2023 టోర్నమెంట్‌ లో విరాట్‌ కోహ్లీతో గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా సోషల్‌ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ..విరాట్‌ కోహ్లీని రెచ్చగొట్టాడు. అటు గంభీర్‌ కూడా లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హాక్ కు సపోర్ట్‌ గా నిలిచాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news