జూన్ 1న ఇండియా కూటమి భేటీ.. ఫ్యూచర్ ప్లాన్ పై చర్చ

-

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్రనేతలు  జూన్ 1వ తేదీన దిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా వారు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారని పార్టీ వర్గాల సమాచారం.  ఈ చర్చల్లో కాంగ్రెస్‌ అగ్రనేతలు, కూటమి నేతలు, ఆమ్‌ఆద్మీ పార్టీ  అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు పాల్గొననున్నట్లు తెలిసింది.

ఇండియా కూటమిలో భాగంగా ఆప్ దిల్లీ, గోవా, గుజరాత్, హర్యానాల్లో కాంగ్రెస్‌తో సీట్ల భాగస్వామ్యంపై ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో రెండుచోట్ల కాంగ్రెస్‌కు పోటీగా బరిలోకి దిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి  28 మంది సభ్యులతో కూడిన ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా కూటమి) గత ఏడాది జులైలో ఏర్పడింది.  కాగా ఎన్డీఏ  కూటమి  కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమయ్యాయి. ఆరు దశల్లో పోలింగ్‌ నిర్వహించారు. జూన్‌ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news