ఎస్​సీవో విందులో.. భారత్, పాక్ విదేశాంగ మంత్రుల హ్యాండ్ షేక్

-

భారత్‌ నేతృత్వంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల మండలి సమావేశం గోవా వేదికగా గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సులో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో భారత్‌తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండబోవని ముందే ప్రకటించిన భుట్టోకు.. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ మర్యాదపూర్వకంగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎస్‌సీవో సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు జైశంకర్‌ గురువారం రాత్రి ప్రత్యేక విందు ఇచ్చారు. బెనాలిమ్‌లోని సముద్ర తీరంలో ఉన్న తాజ్‌ రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన ఈ డిన్నర్‌కు చైనా, రష్యా, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌ విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. పాక్‌ మంత్రి బిలావల్‌ భుట్టో కూడా ఈ విందుకు కాస్త ఆలస్యంగా వచ్చారు. అయితే, విందులో బిలావల్‌, జైశంకర్‌ మాట్లాడుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ.. వీరిద్దరూ కరచాలనం చేసుకుని పరస్పరం పలకరించుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version