రఫేల్‌ యుద్ధవిమానాలకు ఇండియన్ టచ్​.. ఇక పాక్, చైనాకు చుక్కలే

-

చైనాకు, పాకిస్థాన్​కు చుక్కలు చూపించేందుకు ఇండియా ఓ సూపర్ ఐడియా యోచించింది. చైనా, పాక్​ నుంచి ముప్పు పొంచి ఉన్నందున ఫ్రాన్స్​ నుంచి రఫేల్ యుద్ధవిమానాలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిని శత్రు భీకరంగా రూపొందించాలని భారత్ భావిస్తోంది. ఇందులో భాగంగానే దేశీయంగా తయారు  చేసిన అస్త్ర ఎయిర్‌, అస్త్ర మార్క్‌ వంటి క్షిపణులను రఫేల్‌ యుద్ధ విమానాలకు అనుసంధానించేందుకు ప్రయత్నిస్తోంది.

రఫేల్ విమానాలను తయారు చేస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థకు భారత్‌ ఈ ప్రతిపాదనలు పంపింది. ఇది కార్యరూపం దాల్చితే మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి మంచి ఊతమిచ్చినట్లు అవుతుందని భారత్ పేర్కొంది. మరోవైపు.. స్వదేశీ పరిజ్ఞానంతో కొన్ని ప్రైవేటు సంస్థలు రూపొందించిన క్షిపణులను కూడా సమీప భవిష్యత్‌లో రఫేల్ యుద్ధవిమానాలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది.

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో రూపొందించిన అస్త్ర ఎయిర్‌, అస్త్ర మార్క్‌ తదితర క్షిపణులను భారత్‌ ఇప్పటికే వినియోగిస్తోంది. వాటిని రఫేల్‌ యుద్ధ విమానాలకు అనుసంధానించే వెసులుబాటు ఉంటే శత్రువులను మరింత దీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version