Samantha : న్యూ లుక్ లో సమంత రచ్చ.. వీడియో వైరల్

-

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పలు యాడ్ లలో పనిచేసిన ఈమె ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకొని.. ఆ తర్వాత తన నటనతో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలలోనే కాదు కోలీవుడ్ సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది.

అయితే తాజాగా హీరోయిన్ సమంత కొత్త లుక్ లో దర్శనమిచ్చింది. సినిమాలకు హీరోయిన్ సమంత ఇటీవల బ్రేక్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సమయాన్ని ఆమె ప్రకృతిలో గడిపేందుకు సిద్ధమయ్యారు. ఇండోనేషియాలోని పర్యాటక ప్రాంతం బాలీలో న్యూ లుక్ లో ఎంజాయ్ చేసిన వీడియోలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఆ వీడియోలు వైరల్ కావడంతో అందరూ సమంత పై ఘాటుగా స్పందిస్తున్నారు. షార్ట్ హెయిర్ తో సమంత చాలా బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సమంత పేరు ట్విట్టర్ లోను ట్రెండింగ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version