ఇండియాలో లక్ష దాటిన కరోనా మరణాలు

-

భారత్ లో కరోనా కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి దాకా కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా తగ్గాయని అనుకునే లోపే మళ్ళీ విజ్రుంభణ మొదలయింది. తాజాగా నమోదయిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64 లక్ష వేలు దాటింది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటలలో 79,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,73,545కు చేరింది. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,069 మంది మృతి చెందారు. దీంతో కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,00,842కు చేరింది. ఇక దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 54,27,707 మంది కరోనా నుంచి కోలుకోగా నిన్న ఒక్క రోజే 11,32,675 పరీక్షలు చేశారు. దీంతో భారత్ లో ఇప్పటి దాకా చేసిన పరీక్షల సంఖ్యా 7,78,50,403కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news