ఉక్రెయిన్‌పై రష్యాతో విభేదాల్లేవ్‌: భారత్‌

-

రష్యాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ ఉక్రెయిన్తో యుద్ధం గురించి పుతిన్ వద్ద ప్రస్తావించారు. అయితే ఉక్రెయిన్‌ విషయంలో రష్యాతో విభేదాలు తలెత్తాయని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై భారత్ క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్ విషయంలో రష్యాతో విభేదాలపై వచ్చిన వార్తలన్నీ కట్టు కథలేనని భారత్‌ స్పష్టం చేసింది. ఈ కారణంగా ప్రధాని మోదీ పర్యటనలో ఒక కార్యక్రమం రద్దయిందని వచ్చిన సమాచారం పూర్తిగా తప్పని తేల్చి చెప్పింది.

‘నాకు తెలిసిన వివరాల మేరకు మాస్కోలో ప్రధాని మోదీ ఏ కార్యక్రమమూ రద్దు కాలేదు. ఈ వార్తలను చూసి ఆశ్చర్యపోయా. ఇవి తప్పుదోవ పట్టించేవే. పూర్తిగా అవాస్తవం’ అని విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా వియన్నాలో స్పష్టం చేశారు. పుతిన్తో భేటీలో మోదీ.. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి స్వస్థిపలికి శాంతి చర్చలు జరపాలని సూచించిన విషయం తెలిసిందే. బాంబుదాడులు, తుపాకీ కాల్పుల మధ్య శాంతి చర్చలు సఫలం కాబోవని తేల్చిచెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version