IND vs PAK : వర్షం కారణంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు

-

ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇలా మ్యాచ్ రద్దు కావడం ఆసియా కప్ లో ఇది రెండవసారి. 1997లో శ్రీలంక వేదికగా ఇరుజట్ల మధ్య జరగగా… తొలుత పాక్ బ్యాటింగ్కు దిగింది. ఆ సమయంలో భారత బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ జట్టు 9 ఓవర్లు ఐదు వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసింది.

 India vs. Pakistan Match Declared Canceled Due to Rain
India vs. Pakistan Match Declared Canceled Due to Rain

ఈ నేపథ్యంలోనే వర్షం పడటం తో మ్యాచ్ మరుసటి రోజుకు వాయిదా వేశారు. అప్పుడు కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఇక నిన్న మొదటి బ్యాటింగ్ చేసింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే 48 ఓవర్లలో 266 పరుగులకు టీమిండియా ఆల్ అవుట్ అయింది. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగేందుకు పాకిస్తాన్ సన్నద్ధమైన నేపథ్యంలో…. భారీ వర్షం కురిసింది. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో చెరో పాయింట్ ఇచ్చి.. కీలక నిర్ణయం తీసుకున్నారు మ్యాచ్ అంపైర్లు. దీంతో సూపర్ ఫోర్ కు పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news