ఖలిస్థానీల ఏరివేతే లక్ష్యంగా సీక్రెట్ మెమో.. భారత్ క్లారిటీ ఇదే

-

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్యతో భారత్‌, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినడమే కాకుండా దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ మీడియా సంస్థ ‘ది ఇంటర్‌సెప్ట్‌’ ప్రచురించిన ఓ కథనం ఇప్పుడు భారత్​ను మరింత ఇరుకున పడేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ కథనంలో పశ్చిమ దేశాల్లో ఆశ్రయం పొందుతున్న కొన్ని సిక్కు సంస్థలను అణచివేసేలా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది.

అంతే కాకుండా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర అమెరికాలోని తమ ఎంబసీలకు భారత విదేశాంగ శాఖ ఓ ‘సీక్రెట్‌ మెమో’ జారీ చేసిందని ఆ కథనంలో ది ఇంటర్​సెప్ట్ ప్రచురించింది. అందులో భారత నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్న పలువురు ఖలిస్థానీ ఉగ్రవాదుల జాబితా ఉందని.. ఆ సిక్కు వేర్పాటువాదులను అణచివేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని అందులో ఆదేశాలిచ్చిందని పేర్కొంది.

ఇది తీవ్ర దుమారం రేపడంతో తాజాగా భారత విదేశాంగ శాఖ ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తూ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి నివేదికలు అవాస్తవమని, అవన్నీ పూర్తిగా కల్పిత కథనాలని గట్టిగా నొక్కి చెబుతున్నామని బాగ్చీ స్పష్టం చేశారు. ఎలాంటి సీక్రెట్ మెమోను దిల్లీ జారీ చేయలేదని, ఇది భారత్‌కు వ్యతిరేకంగా సాగుతున్న తప్పుడు ప్రచారంలో భాగమని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news