IND VS AUS : మ్యాచ్ కు వర్షం అడ్డంకి..!

-

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ పరాజయం మరవకముందే టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. వరల్డ్ కప్ 2023 ఛాంపియన్ ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై ఐదు 20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ వైజాగ్ వేదికగా గురువారం జరగనుంది. ఇరుజట్లలో సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు.

India vs Australia 1st T20I Weather Report
India vs Australia 1st T20I Weather Report

టీమిండియా అయితే పూర్తిగా కుర్రాళ్లతో బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్ ఆడిన ప్రధాన జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఈ సిరీస్ లో కొనసాగుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ కు వర్షగండం పొంచి ఉంది. మధ్యాహ్నం అనంతరం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వైజాగ్ వాతావరణశాఖ పేర్కొంది. సాధారణంగా ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. కాగా, గురువారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, సూర్యకుమార్ యాదవ్ నడిపించనుండగా… ఆస్ట్రేలియాకు మాథ్యు వేడ్ సారథ్యం వహిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news