కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటదని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చకా బెంగళూరు రియల్ ఎస్టేట్ 28 శాతం పడిపోయింది..తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటదని మంత్రి కేటీఆర్ వివరించారు. తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ ఈ స్టేట్ మెంట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై బీఆర్ఎస్ నేత మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మార్పు రావాల్సిన అవసరం లేదని, 2014లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రూపంలో మార్పు వచ్చిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా రాజకీయ నిరుద్యోగులే మార్పు కోరుకుంటున్నారే తప్ప ప్రజలు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదని కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.