ప్రధాని మోడీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!

-

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే ఆయన ప్రకటను భారత్ ఖండించింది. అలాగే న్యూఢిల్లీలోని సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు.

కాగా.. కెనడాలో స్థావరాలను కలిగి ఉన్న ఉగ్రవాద గ్రూపులకు మద్దతిచ్చే వేర్పాటువాద సంస్థలపై చర్య తీసుకోవాలని భారత్ చేసిన అభ్యర్థనను కెనడా పదే పదే పట్టించుకోలేదని భారత అధికారులు తాజాగా వెల్లడించారు. టెర్రర్ గ్రూపులకు మద్దతిచ్చే కనీసం తొమ్మిది వేర్పాటువాద సంస్థలు కెనడాలో తమ స్థావరాలను కలిగి ఉన్నాయని అధికారులను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ నివేదించింది. అనేక బహిష్కరణ అభ్యర్థనలు ఉన్నప్పటికీ.. కెనాడా ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదని పేర్కొంది. ఇక, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సహా నేరాల్లో కూడా ఈ సంస్థల ప్రమేయం ఉంది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్‌పై కెనడా చేస్తున్న ఆరోపణలు నిరాధారమైన కేంద్ర ప్రభుత్వ అధికారులు వర్గాలు తెలిపాయి. వాంటెడ్ టెర్రరిస్టులు, గ్యాంగ్‌స్టర్ల బహిష్కరణ అంశాన్ని భారత అధికారులు బహుళ దౌత్య, భద్రతా చర్చలలో లేవనెత్తారని వారు చెప్పారు. అయితే కెనడా మాత్రం ఈ టెర్రర్ ఎలిమెంట్స్‌కు మద్దతుగా నిబద్ధత లేకుండా, నిస్సంకోచంగా ఉండిపోయిందని పేర్కొన్నారు. ‘కెనడా వైపు అనేక పత్రాలు అందజేసినప్పటికీ భారతదేశం బహిష్కరణ అభ్యర్థనలు పరిష్కరించబడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news