దేశంలోనే సంపన్న గణపయ్య..రూ. 360.40 కోట్లతో బీమా రక్షణ తీసుకున్న నిర్వాహకులు

-

వినాయకచవితి వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. చలువ పందిళ్లలో గణనాథులు కొలువుదీరారు. మనం ఇప్పటికే చూస్తున్నాం.. డిఫ్రెంట్‌ థీమ్స్‌తో వినాయకులను ప్రతిష్టించారు. చంద్రయాన్‌ 3 సక్సస్‌ను దృష్టిలో పెట్టుకుని ఇస్రో కాన్సప్ట్స్‌, చంద్రుడిపైన వోమగామిలా వినాయకుడి, రోవర్‌పై కుర్చున్నట్లు చేశారు, చెరుకుగడలతో, కరెన్సీ నోట్లతో, కొబ్బరి కాయలతో ఇలా వివిధ రకాలుగా వినాయకుడిని చేశారు. ఇప్పుడు చెప్పుకోబోయే వినాయకుడి దేశంలోనే అత్యంత సంపన్నమైన గణపతి. ఈ గణపతికి ఇన్సూరెన్స్‌ కూడా చేయించారట.

దేశంలో ఇతర చోట్ల కన్నా ముంబై గణపతులు ఎప్పుడూ స్పెషలే. ఇక్కడ మెయిన్ లాల్ బాగ్చా గణపయ్య, గురించి మనం మెయిన్‌గా వింటూనే ఉంటాం. ఈయనను ముంబైకా రాజా అని కూడా పిలుస్తారు. రాజకీయనాయకులు, యాక్టర్స్, పలు రంగాలలోని దిగ్గజాలు అందరు కూడా గణపయ్య నవరాత్రులలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ క్రమంలో.. జీఎస్‌బీ సేవా మండల్‌ గణేశోత్సవంలో అత్యంత ధనిక గణేశ విగ్రహం వెలుగులోకి వచ్చింది

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జిఎస్‌బి సేవా మండల్ మహాగణపతిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మహాగణపతిని 66.5 కిలోల బంగారు ఆభరణాలు, 295 కిలోల వెండి, ఇతర విలువైన ఆభరణాలతో అలంకరించారు. ముంబై యొక్క ప్రసిద్ధ GSB సేవా మండల్ ఈ సంవత్సరం సేవా మండల్ తన 69వ వార్షికోత్సవాన్ని నగరం యొక్క తూర్పు భాగంలోని కింగ్స్ సర్కిల్‌లో జరుపుకుంటోంది.

భక్తుల భద్రత దృష్ట్యా సేవా మండల్ తొలిసారిగా అన్ని ప్రదేశాలలో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. జీఎస్‌బీ సేవా మండల్‌ మాట్లాడుతూ ఈ ఏడాది రూ. 360.40 కోట్ల బీమా రక్షణను తీసుకున్నామన్నారు. మరోవైపు భక్తులను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు క్యూఆర్‌ కోడ్‌లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ ఏర్పాటు చేశారు.

ప్రత్యేకంగా భద్రత కోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా గణపతి ఉత్సవాల సందర్భంగా రామమందిర నిర్మాణం, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సేవా మండల నిర్వాహకులు తెలిపారు. భక్తుల రద్దీని బట్టి భద్రత సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా సీసీ కెమెరాలో అధికారులు నిరంతరం అలర్ట్‌గా ఉంటున్నారు. భక్తులను పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలలో నిరంతరం రాకపోకలను ఒక కంట కనిపెడుతునే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news