ఇన్ఫోసిస్ దాతృత్వం.. పేద బాలికల చదువుకు ₹100 కోట్లు

-

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. వెనకబడిన కుటుంబాలకు చెందిన బాలికల చదువుకు తన వంతున సహకారం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ద్వారా బాలికలకు స్కాలర్‌షిప్‌లను అందించనుంది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

‘STEM Stars’ స్కాలర్‌షిప్‌ ద్వారా బాలికల చదువుకు ఆర్థిక సాయం అందుతుందని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తెలిపింది. ట్యూషన్‌ ఫీజు, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్‌ ఇలా.. అన్నింటికీ కలిపి ఏడాదికి లక్ష రూపాయలు.. నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. ఈ కార్యక్రమం మొదటి ఫేజ్‌లో భాగంగా 2,000 మందికి పైగా బాలికల చదువుకు సాకారం అందించనుంది. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం (STEM) ఏ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించినా ఇన్ఫీ ఫౌండేషన్‌ వారి ఆ బాధ్యతలు చూసుకుంటుందని ఇన్ఫోసిస ఫౌండేషన్‌ ట్రస్టీ సుమిత్‌ విర్మనీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version