దిల్లీ ట్రాఫిక్ నరకం.. ఇక్కడికి రావాలంటే ఇబ్బందిగా ఉంది: నారాయణమూర్తి

-

దిల్లీకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. దేశ రాజధానిలో ట్రాఫిక్ నిబంధనలు ఎవరూ పట్టించుకోరని.. ఇక్కడి ట్రాఫిక్ నరకమని అన్నారు. అందుకే ఇక్కడికి రావాలంటే తనకు అసౌకర్యంగా ఉంటుందని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ దిల్లీలో ఎవరూ ట్రాఫిక్‌ నిబంధనలు సరిగా పాటించరు. అందుకే ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.నిన్న నేను విమానాశ్రయంలో దిగి కారులో హోటల్‌కు వెళ్తున్నాను. మధ్యలో ఎన్నో రెడ్‌ సిగ్నల్స్‌ పడ్డాయి. కానీ, ఎవరూ వాహనాలు ఆపడం లేదు. అలాగే ముందుకు వెళ్లిపోతున్నారు. ’’ అని  నారాయణమూర్తి అన్నారు. ఒకట్రెండు నిమిషాలు కూడా ఆగకపోతే ఎలా?అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కనీసం అక్కడ డబ్బులు వేస్తే అప్పుడైనా ఆగుతారేమోనని నారాయణమూర్తి అన్నారు.

సమాజంలో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలని నారాయణమూర్తి అన్నారు. అప్పుడే పిల్లలు సరైన మార్గంలో పయనించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడే పిల్లలు అనవసరమైన ఉద్రిక్తతలకు లోనుకాకుండా ఉంటారని చెప్పిన ఆయన..కార్పొరేట్‌ పాలన గురించి పాఠశాల వయస్సులోనే తాను నేర్చుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news